సినిమాల్లోనేకాదు.. దైనందిన జీవితంలోనూ కచ్చితంగా వ్యవహరించడం మంచు విష్ణుకే కాదు, మోహన్ బాబు దగ్గర్నుంచి మంచు ఫ్యామిలీలో అందరికీ అలవాటు. ఇప్పటికే యాక్షన్ హీరోగా తనేంటో ప్రూవ్ చేసుకున్న మంచు విష్ణు మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. లేటెస్ట్ మూవీ ‘ఓటర్’ లోనూ చాలా అగ్రెసివ్ గా కనిపించారు విష్ణు. మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా రిలీజ్ చేసిన ఓటర్ సినిమా టీజర్లో విష్ణు ఆకట్టుకుంటున్నారు. ప్రజాస్వామ్యానికి వెన్నుముఖ లాంటి ఓటర్ దమ్ముని విష్ణు ఈ టీజర్ లో చూపించారు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ‘అడ్డా’ సినిమా తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సురభి హీరోయిన్.  సంపత్ రాజ్, పోసాని, నాజర్, ప్రవీణ్ ఇతరతారాగణం. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులల్లో ఉంది. ఎన్నికల సమయం కావడంతో సినిమా తప్పకుండా ప్రేక్షకుల్లోకి వెళ్తుందన్న ఆశాభావంతో యూనిట్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల లోపే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *