లిప్‌లాక్‌‌లో రెచ్చిపోయిన తాప్సీ

అభిషేక్‌బచ్చన్- విక్కీ కుశాల్- తాప్సీ కాంబోలో రానున్న రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ ‘మన్మార్జియాన్’. ఈ చిత్రానికి సంబంధించి మూడునిమిషాల నిడివిగల ట్రైలర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో హీరోయిన్ తాప్సీ లిప్‌లాక్ సీన్స్‌లో రెచ్చిపోయింది. నటుడు విక్కీ కౌశల్‌తో ఆమె చేసిన సీన్స్ మూవీకే హైలైట్‌గా నిలుస్తాయని యూనిట్ చెబుతున్నమాట. లిక్‌లాక్ సీన్స్ గురించి ముందుగానే వివరించిన తర్వాత ఆమె ఓకే చేసిందని అంటున్నారు.

ముక్కోణపు లవ్ స్టోరీగా రానుంది ఈ ఫిల్మ్. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత పంజాబీ గెటప్‌లో అభిషేక్‌బచ్చన్ కనిపిస్తున్నాడు. గతంలో తాప్సీ బాలీవుడ్‌లో చాలా సినిమాలు చేసినా సరైన హిట్ ఒక్కటీ లేదు. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్‌ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఆశలు పెట్టుకుంది. సెప్టెంబర్ 14న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్.రాయ్ నిర్మించాడు.