మన టెలిపతి (మెదడులోని ఆలోచనలను పసిగట్టే) విధానాన్నే దాదాపుగా ఫేస్ బుక్ సిఈవో మార్క్ జుకర్‌బెర్గ్ కూడా అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి ఓ టెక్నాలజీ మీద ఆయన దృష్టి పెట్టాడు. ” బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ ‘ పేరిట ఫేస్ బుక్ లో ఈ టెక్నాలజీకి అంకురార్పణ చేస్తానని ఆయన ప్రకటించాడు.

హార్వర్డ్ ప్రొఫెసర్ జోనాథన్ కి ఇచ్చిన చిన్నపాటి ఇంటర్వ్యూ లో …యూజర్లు ఊహించని ఈ కొత్త టెక్నిక్ గురించి వివరించాడు. వారు ఎలాంటి కీ బోర్డులు, టచ్ స్క్రీన్లు వాడకుండానే..లేదా చేతి సైగలు చేయకుండానే.. తమ మెదడును ఉపయోగించి పరిసరాలతో ఇంటరాక్ట్ కావచ్చునట. ఓ ‘ ఏఆర్ ‘ రూమ్ లో కూర్చుని.. మైండ్ సాయంతో ఏ వస్తువునైనా కదిలించవచ్చునని, మెదడుతోనే పదాలను టైప్ చేయవచ్చునని జుకర్‌బెర్గ్ చెబుతున్నాడు. అయితే ఇందుకు యూజర్లు షవర్ క్యాప్ వంటి పరికరాన్ని తమ తలపై ధరించాల్సి ఉంటుందని, దీనికి, మెదడు లోని యాక్టివిటీకి, రక్త ప్రసరణకు, ఆలోచనలకు లింక్ ఉంటుందని ఆయన అంటున్నాడు.

టెక్నాలజీతో ఇంటరాక్ట్ కావడానికి మానవులకు ఈ మైండ్ రీడింగ్ డివైజ్ ఎంతో తోడ్పడుతుందని ఆయన చెప్పాడు. ప్రస్తుతం మనం వాడుతున్న ఫోన్లు, కంప్యూటర్ సిస్టం లు, యాప్ లు మొదలైనవి మన మైండ్ ఎలా పని చేస్తుందో పసి గట్టలేవని, కానీ ఈ పరికరం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందని తెలిపాడు. అయితే..ఈ సాధనం ఎలా పని చేస్తుందో వివరించేందుకు జుకర్‌బెర్గ్ విముఖత చూపాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *