అమ్మకు వందనం!

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే! కోట్లాదిమంది మదిలో ఆయన మెగాస్టార్ అయినా… అమ్మ అంజనాదేవికి మాత్రం గారాల బిడ్డడే! అందుకే మెగాస్టార్ చిరంజీవి… ‘మదర్స్ డే’ సందర్భంగా అమ్మ పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. తన తమ్ముడు నాగబాబు, ఇద్దరు సోదరీమణులతో కలిసి, అమ్మ అంజనాదేవీకి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి, ఆమె నుండీ నిండైన ఆశీస్సులు అందుకున్నారు. పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్ళడం వల్ల పాల్గొనలేక పోయారు.