ఆగస్ట్ 22న.. సైరా బ్రేకింగ్!

మెగా ప్రెస్టీజియస్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’కి సంబంధించి ఒక హాట్ న్యూస్! ఆగుతూ సాగుతున్న ఈ సినిమా ఇకనుంచి పట్టాలెక్కి రయ్యిన దూసుకుపోతుందట! జూన్ 7న హైదరాబాద్‌లో మొదలయ్యే కీలక షెడ్యూల్.. ఏకబిగిన 40 రోజుల పాటు సాగుతుందని.. ఎటువంటి అవాంతరాలొచ్చినా.. ఈ స్ట్రెచ్ బ్రేక్ కాబోదని మేకర్స్ చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సమ్మర్‌కి రిలీజ్ కావాల్సిందేంటంటూ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి మెగాస్టార్ టార్గెట్ పెట్టిన నేపథ్యంలో.. ప్రొడక్షన్ టీం మొత్తం సీరియస్‌గా వర్కవుట్ చేస్తోంది. ఈ 40 రోజులూ నైట్ ఎఫెక్ట్‌తో కూడిన దృశ్యాలే ఎక్కువగా చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చిరు పుట్టినరోజు.. ఆగస్టు 22న సైరా ఫస్ట్‌లుక్ విడుదల చేయాలన్న ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి గెటప్స్ కొన్ని మీడియాలో వచ్చేశాయి. కానీ.. అఫీషియల్ లుక్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘మెగా బర్త్‌డే’ దాకా వెయిట్ చేస్తే.. ఆ లోటు కూడా తీరిపోవడం ఖాయమే మరి!