మెగాస్టార్ చిరంజీవి త‌న త‌మ్ముళ్ల‌కి ప్ర‌చారం చేయ‌డ‌ట‌. పెద్ద త‌మ్ముడు నాగబాబు ఇటీవ‌లే జ‌న‌సేన‌లో చేరారు. చేరిన వెంట‌నే న‌ర్సాపురం ఎంపీ టికెట్ అందుకున్నారు. కుటుంబ పాల‌న ఇన్నాళ్లూ ఇత‌ర పార్టీల‌ని తిట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇపుడు త‌న సోద‌రుడికి టికెట్ ఇచ్చి విమ‌ర్శ‌ల‌ను మూట‌గ‌ట్టుకున్నారు. ఐతే ఇద్ద‌రు త‌మ్ముళ్ల ఎన్నిక‌ల స్టింట్‌కి అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి మాత్రం దూరంగా ఉంటార‌ట‌.
రాజ‌కీయాల నుంచి ఆయ‌న దాదాపుగా త‌ప్పుకున్న‌ట్లే. ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన త‌ర్వాత మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఐతే కొన్నాళ్లూగా ఆయ‌న పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉండడం లేదు. ఉండే ఆలోచ‌న కూడా లేద‌ట‌. పూర్తిగా సినిమాల‌కే అంకితం ఇక‌పై. ప్ర‌స్తుతం సైరా న‌ర్సింహారెడ్డి సినిమా షూటింగ్‌లో ఉన్నారు చిరంజీవి. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల టైమ్‌లో చిరంజీవి అస్స‌లు ఇండియాలోనే ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, సైరా సినిమా షూటింగ్ కోసం జ‌పాన్ వెళ్తార‌ని టాక్‌.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *