మెగాస్టార్ చిరంజీవి 151వ మూవీ కోసం తెలుగు ప్రేక్షక లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పక్కా మాస్ జానర్‌తో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. తర్వాతి సినిమా కోసం హిస్టారికల్ సబ్జెక్టు ఎంచుకోవడంతో ఎంతమేరకు ప్రూవ్ చేసుకుంటారన్న సస్పెన్స్ మెగా ఫ్యాన్స్‌లో కూడా నెలకొంది. అయితే.. 152వ ప్రాజెక్టుతో మరో డిఫెరెంట్ జానర్‌తో అభిమానుల్ని మెస్మరైజ్ చేయడానికి చిరు సిద్ధమయ్యారు.

సైరా షెడ్యూల్స్ స్పీడ్ అందుకోవడంతో.. నెక్స్ట్ ఏంటి? అనే ప్రశ్న మెగా క్లబ్‌లో షురూ అయ్యింది. టాలీవుడ్ హీరోలకు వరుసపెట్టి సక్సెస్‌లిచ్చుకుంటూ వెళ్తున్న కొరటాల శివకు మెగాస్టార్ ఓకే చెప్పారన్న వార్త పాతదే! కానీ.. వీళ్లిద్దరి కాంబినేషన్ సందేహాస్పదంగా మారిందంటూ కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. కథ సరిగ్గా కుదరకపోవడంతో చిరంజీవి పునరాలోచన చేస్తున్నట్లు చెప్పుకున్నారు. అయితే.. అవన్నీ పనికిమాలిన రూమర్లేనంటూ తాజా అధికారిక ప్రకటన వచ్చేసింది.

చిరు#152 ప్రాజెక్టుని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాటినీ ఎంటర్‌టైన్మెంట్స్.. సంయుక్తంగా చేపట్టనున్నారన్న వార్త ఖరారైంది. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయని, కథా చర్చల్లో కొరటాల శివ బిజీగా వున్నారని, సైరా షూట్ పూర్తి కాగానే మెగాస్టార్ డేట్స్ ఫిక్స్ చేస్తారని అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మిగతా కాస్టింగ్, టెక్నీషియన్స్‌ని ఎంపిక చేయడం కూడా పూర్తి కావచ్చిందట. ఒకవైపు RRR మూవీతో బిజీగా ఉంటూనే.. నిర్మాతగా మెగాస్టార్ 152వ సినిమా పనుల్ని కూడా చక్కబెడుతున్నాడు రామ్ చరణ్ తేజ్. ఈ మూవీలో చిరంజీవి ఫక్తు పొలిటిషియన్‌గా కనిపిస్తాడన్నది తాజా ఊసు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *