2018 ఏడాది ప్రపంచ సుందరిగా మెక్సికో యువతి మిస్‌ మెక్సికో వనెస్సా పోన్స్‌ దెలియోన్‌ ఎంపికయింది. 2017 ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ తన వారసురాలికి కిరీటాన్ని పెట్టి అభినందనలు తెలిపారు. ఈ పోటీలకు వివిధ దేశాల నుంచి 118 మంది అమ్మాయిలు పాల్గొన్నారు.

చైనాలోని సాన్యా సిటీ ఎరెనా ఈ పోటీలకు వేదికైంది. ఫైనల్లో వనెస్సా ఆకట్టుకొనే గౌన్‌ ధరించి మెప్పించారు. ప్రపంచ సుందరిగా మీ స్థాయిని ఇతరుల కోసం ఏ విధంగా ఉపయోగిస్తారని ఫైనన్‌లో అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతల హృదయాలను గెల్చుకుంది.

ఫస్ట్ రన్నరప్‌గా థాయ్‌లాండ్ యువతి, సెకండ్ రన్నరప్‌గా జమైకా బ్యూటీ ఎంపికయ్యారు.

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *