ప్రధాని మోదీకి ఇంగ్లిష్ మాట్లాడడం సరిగా రాదని ఎద్దేవా చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇంగ్లిష్‌‌లో మాట్లాడాలనుకుంటే ఆయనకు  టెలిప్రాంప్టర్ సాయం ఎంతయినా అవసరమని అన్నారు. కనీసం ఒక్క వాక్యమైనా ఆ భాషలో మాట్లాడలేని ఆయనకు ఎప్పుడూ దీని సాయం ఉండాల్సిందే.. మోదీ చాలా ప్రసంగాలు చేస్తారు. కానీ ఇంగ్లిష్ రాదు. మొత్తం మీడియాకు, ప్రజలకు కూడా ఈ విషయం తెలుసు అని దీదీ పేర్కొన్నారు. ఆయన మొదట స్క్రీన్ చూస్తారని, ఇంగ్లిష్‌లో ఏం చెప్పాలో చూసి ఆ తరువాత పెద్ద భాషా ప్రవీణుడిగా స్పీచ్ ఇస్తారని, కానీ ఇదంతా తమకు అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించినట్టు కోల్‌కతలోని ఓ వెబ్‌సైట్ తెలిపింది.

మోదీ ప్రభుత్వం గత ఏడాది ప్రారంభించిన ఆరోగ్య పథకం..’ ఆయుష్మాన్ భారత్ ‘ ను తాము అమలు చేసే ప్రసక్తి లేదని మమత అన్నారు. ఈ పథకం కింద మోదీ సర్కార్ డర్టీ పాలిటిక్స్‌కి పాల్పడుతోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి కూడా అయిన ఆమె దుయ్యబట్టారు. ‘ ఈ స్కీమ్ పేరిట మీ ఫోటోతో మా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దీని గురించి లేఖలు పంపుతారా ? ఇది చీప్ పాలిటిక్స్ కాదా ? ‘ అని మమతా బెనర్జీ ప్రశ్నించారు.

Image result for the accidental prime minister

రానున్న రోజుల్లో ‘నిరాశావాది ప్రధాని’ అనే కొత్త సినిమాని దేశ ప్రజలు చూడబోతున్నారని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. శుక్రవారం రిలీజైన ‘ ది యాక్సిడెంటల్ ప్రైమినిస్టర్’ అనే సినిమా నేపథ్యంలో ఆమె సెటైరిక్‌గా ఈ మాటలన్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీకి ఓటమి తప్పదని పరోక్షంగా ‘బాంబు’ పేల్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *