ప్రధాని మోదీ ఈసారి ఎక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారు? ఒక సీటు వారణాసి కాగా, మరొకటి ఎక్కడ? కొన్నాళ్లుగా దీనిపై తర్జనభర్జన జరుగుతోంది. తొలుత పూరీ నుంచి బరిలోకి దిగే ఛాన్స్ వుందని వార్తలొచ్చినప్పటికీ వాటిని బీజేపీ ఖండించలేదు. దీంతో ఆయన పూరీ నుంచి ఆయన పోటీకి దిగడం దాదాపు ఖాయమని అనుకున్నారు. తాజాగా మోదీ వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. బలం లేని రాష్ర్టంకన్నా.. పట్టున్న ప్రాంతంలో సీట్లు ఎక్కువగా దక్కించుకోవడమే బెటరన్న ఆలోచనకు ఆయన వచ్చినట్టు సమాచారం. ఇందులోభాగంగా దక్షిణాదిపై మోదీ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.

బెంగళూరు సౌత్ నుంచి మోదీ స్వయంగా బరిలోకి దిగుతున్నట్టు బీజేపీ నుంచి ఓ ఫీలర్ బయటకువచ్చింది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి అనంతకుమార్ వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. కుమార్ మరణం తర్వాత ఆయన భార్య తేజస్వినిని బరిలోకి దించాలని బీజేపీ ప్లాన్ చేసింది. కర్ణాటకలో మొత్తం 28 సీట్ల వుండగా.. అందులో 21 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో బెంగళూరు సౌత్ సీటుని పెండింగ్‌లో పెట్టారు. నిజానికి ఈ స్థానం నుంచి దివంగత కేంద్రమంత్రి అనంతకుమార్ భార్య తేజస్వినిని బరిలోకి దించాలని ఆలోచన చేసింది. అయితే, అనూహ్యంగా ఆమెను పక్కనపెట్టి మోదీ పేరును తెరపైకి తీసుకొచ్చారట అమిత్ షా.

తరచూ మాజీ సీఎం యడ్యూరప్పు వివాదాల్లో చిక్కుకోవడం, అక్కడ జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన ఎదుర్కొన లేకపోతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే మోదీ పేరు తెరపైకి వచ్చింది. మొత్తానికి కొద్దిరోజులు ఆగితే మోదీ ఎక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారన్నది తేలిపోనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *