నటుడు మోహన్‌బాబు స్పీడ్‌కు బ్రేక్ వేశారు పోలీసులు. తన విద్యా సంస్థకు రావాల్సిన ఫీజు బకాయిల విషయంలో కొన్ని రోజులుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి చిత్తూరుకు చేరుకున్న ఆయన.. తన విద్యా సంస్థ విద్యార్థులతో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతిలో ధర్నాకు సిద్ధమయ్యారు. ఐతే, తిరుపతిలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు పోలీసులు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ పాఠశాల ఆవరణ ఎదుట బైఠాయించారు. ఐనా సరే ధర్నా కొనసాగించాలని నిర్ణయించడంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

ఫీజుల విషయంలో ఇన్నాళ్లు సైలెంట్‌గా వున్న మోహన్‌బాబు.. ఇప్పుడు ఆందోళన వెనుక వైసీపీ ప్రమేయముందని అంటున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన మోహన్‌బాబు ఆందోళన చేసినా ఫలితం వుండదని, కాకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడమే కారణమని అంటున్నారు నేతలు. ఈ విషయంలో గతంలో చంద్రబాబు కలిసి సమస్యని వివరిస్తే బాగుండేదని, ఇలా రోడ్డు మీదకు రావడం బాగా లేదని అంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయన సమస్యకు పరిష్కారం దొరకదని అంటున్నారు.

మరోవైపు మోహన్‌బాబు కక్షపూరిత విమర్శలు ఎందుకు చేస్తున్నారని తెలీదన్నారు ఏపీ ప్రభుత్వ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు. అనవసర విమర్శలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అందరికీ అత్యంత పారదర్శకంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు జరుగుతున్నాయని, అసలు రీయింబర్స్‌మెంట్ చెల్లించనట్టు మాట్లాడడం తగదన్నారు. 25శాతం మందిని ఉచితంగా చదివిస్తామని చెబుతుంటారని, ఆయనకు సంబంధించి నాలుగు కళాశాలల్లోవున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకున్నారో లేదో ఆయన్ని అడగాలన్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *