డాక్టర్ల నిర్లక్ష్యం ఆ మహిళకు శాపమైంది..కేవలం చిన్నపాటి బ్లీడింగ్ అయినందుకు ఆసుపత్రిలో చేరిన ఆమెకు ఎనస్తీషియా ఇచ్చి సర్జరీ చేశారు వైద్యులు. అసలే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రం ! ఆ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆమెకు పక్షవాత లక్షణాలు కూడా సోకాయి. సరిగా మాటలు కూడా మాట్లాడలేకపోయింది. సర్జరీ దాదాపు విజయవంతమైనా..ఎనస్తీషియా ఇస్తుండగా జరిగిన పొరబాటు కారణంగా ఆమె నిత్య రోగిగా మారిపోయింది. కెనడాలో 55 ఏళ్ళ డోనా పెనర్ అనే మహిళ..ఇలా నరకమే అనుభవించింది.

సుమారు పదేళ్ళ క్రితం జరిగిన ఈ ‘ దారుణ ‘ వైద్యోదంతం ఇప్పటికీ ఆమెను పీడకలగానే వేధిస్తోంది. ప్రతిరోజూ మందులు వాడాల్సిందే. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే ! అయితే ఇలా జరగడం తమ తప్పే అని, ప్రతి 20 మందిలో ఒకరికి మాత్రమే ఈ విధమైన రుగ్మత సోకుతుందని సదరు ఆసుపత్రి డాక్టర్లు అంటున్నారు. పైగా కెనడాలోని ఆల్టోనాలో అది పేరు పొందిన హాస్పిటల్ కూడా.. అయినా..డోనా చికిత్స..ఇలా దాదాపు ‘ విషమించినంత ‘ పని చేసింది. ఎంత అభివృద్ది చెందిన దేశమైనా.. డాక్టర్ల నిర్లక్ష్యం రోగుల పాలిట శాపంగా మారుతోందనడానికి ఈమె ఉదంతమే నిదర్శనం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *