సౌతిండియన్ సూపర్ స్టార్, గ్లామర్ ఇండస్ట్రీ ఐకాన్ రజనీకాంత్.. ఇండియన్ కార్పొరేట్ సెక్టార్లో సూపర్ స్టార్ ముకేశ్ అంబానీ..! ఇద్దరూ చెన్నపట్నంలో సందడి చేశారు. రజనీకాంత్ కూతురు సౌందర్య వెడ్డింగ్ రిసెప్షన్‌కి భార్య నీతాతో కలిసి హాజరయ్యారు ముఖేష్ అంబానీ. చెన్నైలోని లీలా ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ వేడుకకు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. తర్వాత వెడ్డింగ్ రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిగింది. కొత్త దంపతులను ఆశీర్వదించడానికి భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ హాజరై.. రజనీతో కాసేపు సరదాగా ముచ్చటించారు.


ఇదిలా ఉంటే.. మార్చి 9న ముఖేష్‌ అంబానీ ఇంట కూడా పెళ్లి బాజా మోగనుంది. కొడుకు ఆకాశ్ అంబానీ వివాహం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వజ్రాల వ్యాపారి రస్సెల్‌​ మెహతా కూతురు శ్లోకా మెహతా.. అంబానీ ఇంటికి కోడలవబోతోంది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగే ఈ వేడుకకు ప్రముఖులందరినీ వ్యక్తిగతంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు ముకేశ్ దంపతులు. ఇదే క్రమంలో చెన్నై వెళ్లి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆయన భార్య దుర్గా స్టాలిన్‌ను కలిసి పెళ్లి పత్రిక అందజేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *