కంగనా, బిపాసా కూడా ...

పంజాబ్ నేషనల్ బ్యాంక్, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వ్యవహారంలో తామూ మోసపోయామంటున్నారు మరో ఇద్దరు బాలీవుడ్ తారలు. నీరవ్ మోదీ జువెల్లరీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక చోప్రా, తన కాంట్రాక్టును రద్దు చేసుకోవడానికి లీగల్ చర్యలకు ఉపక్రమించిందని వార్తలు వస్తుండగా.. మరో ఇద్దరు సెలబ్రిటీలు.. కంగనా రనౌత్, బిపాసా బసు కూడా తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు.
నీరవ్ బంధువు మెహుల్ చోక్సీ ఆధ్వర్యంలోని గీతాంజలి జెమ్స్ బ్రాండ్ ” నక్షత్ర ” కు.. ఇదే సంస్థ నేతృత్వంలోని ” గిలి ” కి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన వీరు.. తమ కాంట్రాక్టు తాలూకు సొమ్మును చెల్లించకుండా ఈ కంపెనీ ముఖం చాటేస్తోందని ఆరోపిస్తున్నారు. కంగనా 2016 నుంచి ప్రచారకర్తగా వ్యవహరించగా.. బిపాసా అయితే అంతకుముందు నుంచే..అంటే 2008 నుంచే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వచ్చింది. తన కాంట్రాక్టు కాలపరిమితి ముగిసినా.. తన ఫోటోలు పెట్టుకుని ప్రచారం చేశారని, దీనిపై తన మేనేజర్ ఆ కంపెనీని సంప్రదించినా ఫలితం లేకపోయిందని బిపాసా అంటోంది.