దేవదాస్ మళ్ళీ పుట్టాడు! డాక్టర్ చీటీపై వెరైటీ టైటిల్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానీ కాంబోలో రానున్న మల్టీ స్టారర్ ‘దేవదాస్’! ఆదిత్య శ్రీ‌రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని వైజ‌యంతి మూవీస్ బేనర్‌పై అశ్వినీద‌త్, దిల్ రాజు నిర్మిస్తున్నారు. నానికి జోడీగా రష్మిక మందాన, నాగార్జునకు జోడీగా ఆకాంక్ష సింగ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 13న రానున్న ‘దేవదాస్’ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. శాంతా భాయ్ మెమోరియల్ చారిటీ హాస్పిటల్ లెటర్ హెడ్ పై రాసిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద సినిమా టైటిల్‌ని ప్రింట్ చేసి.. వెరైటీ చూపించారు మేకర్స్. ఇందులో నాగార్జున మాఫియా డాన్‌గా, నాని డాక్ట‌ర్‌గా చేస్తున్నట్లు ఇప్పటికే ఫీలర్లొచ్చేశాయి. మ‌ణిశ‌ర్మ సంగీతం ఇస్తున్నాడు.