బిగ్ బాస్-3 సీజన్ షో సన్నాహాలను స్టార్ మా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ షో ఫస్ట్ సీజన్ హోస్ట్‌గా ఎన్టీఆర్ రక్తి కట్టించగా.. 2 షో‌కి నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్‌కి కూడా ఎన్టీఆర్ ని ఎంపిక చేయాలని నిర్వాహకులు భావించినప్పటికీ.. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకోసం ఆయన వరుసగా డేట్స్ ఇచ్చిన కారణంగా ఈ ఆఫర్ ని తిరస్కరించినట్టు తెలుస్తోంది. దాంతో నిర్వాహకులు నాగార్జునను సంప్రదించారని  సమాచారం. గతంలో   మీలో ఎవరు కోటీశ్వరుడు  షో‌ని నాగ్ తనదైన స్టయిల్ లో నిర్వహించి బుల్లితెర ఆడియెన్స్‌కి మరింత చేరువయ్యాడు. అందువల్ల బిగ్ బాస్-3 హోస్ట్‌గా ఆయనను తీసుకోవాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నా..అవి ఆయన సొంత బ్యానర్‌వే  కావడంతో డేట్స్ సమస్య ఉత్పన్నం కాదనే అభిప్రాయాలు వినవస్తున్నాయి.అటు-విక్టరీ వెంకటేష్ తో కూడా ఆర్గనైజర్లు చర్చలు జరుపుతున్నారట.  ‘ఎఫ్-2’  సినిమాతో వెంకటేష్ తనలోని కామెడీ ఏ రేంజిలో ఉందో చూపాడు. ఇంతవరకు బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వని వెంకీ.ఒకవేళ ఖరారైతే.. ఈ షో తో ఎంట్రీ ఇస్తాడా అన్నది తేలాల్సి ఉంది. నాగ్ వర్సెస్ వెంకీ..మరి.. ఈ గేమ్‌లో ఎవరు బాస్ ?

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *