ఆగస్టులో రానున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’

తన ‘యుద్ధం శరణం’ చిత్రం ఫ్లాప్ అయిన తరువాత నాగ చైతన్య చాలా ఎలర్ట్‌గా ఉంటున్నాడు. కథ నచ్చితేనే ఓకె చెబుతున్నాడు. ప్రస్తుతం ‘ సవ్యసాచి ‘, ‘ శైలజా రెడ్డి అల్లుడు ‘ సినిమాలతో బిజీగా ఉన్న చైతూ.. స్క్రిప్ట్‌ల ఎంపికలో ఆచితూచి అడుగువేస్తున్నాడు. తాజాగా ఈ హీరో సినిమా  ‘ శైలజా రెడ్డి అల్లుడు ‘  దాదాపు పూర్తి కావస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 31 న రిలీజ్ చేయాలన్నది మేకర్స్ యోచన. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతూకు జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. గతంలో వచ్చిన నాగార్జున సినిమా..అల్లరి అల్లుడు మాదిరే ఇది కూడా కామెడీ, రొమాన్స్ కలబోతగా ఉండబోతోంది. శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ, ఆమె కూతురుగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.