నందమూరి బాలకృష్ణ.. కొణిదెల నాగబాబుల కాంట్రవర్సీ ఇంకాఇంకా లోతులకెళ్ళిపోతోంది. బాలకృష్ణ గతంలో చేసిన కామెంట్లన్నిటినీ పూసగుచ్చి ఒక్కోదానికి కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్తున్న నాగబాబు.. ”ఇక చిట్టచివరిది ఒక్కటే మిగిలింది.. దాని కోసం కూడా వెయిట్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ క్లయిమాక్స్..” అంటూ తాజాగా అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. ‘మీ పేరు ప్రస్తావించకుండా చేసిన ఐదు కామెంట్లూ మిమ్మల్ని ఉద్దేశించి చేసినట్లుగా ఆపాదించుకుని గింజుకుంటున్నారెందుకు?’ అంటూ సూటిగా ప్రశ్నించిన నాగబాబు.. ఈసారి బాలకృష్ణ పేరును, ఎన్టీయార్ బయోపిక్‌ని ప్రస్తావించిమరీ ఆవేశపడ్డారు. ”మీరేమన్నా నోరుమూసుకుని కూర్చోలేం కదా..? ధర్మరాజు లాంటి మా అన్నయ్య చెప్పాడు కాబట్టి ఇన్నాళ్లూ సైలెంట్‌గా వున్నాం.” అన్నారు. ఇక చింపుకున్నది చాలు.. ఇక్కడితో ఆపేద్దాం.. లాస్ట్ పంచ్ కోసం ఎదురుచూడండి.. అంటూ సస్పెన్స్‌లో పెట్టేశారు. ‘లాస్ట్ పంచ్’ నాగబాబుదైతే ఆ కిక్కే వేరప్పా అనుకోడానికి లేదేమో! ఎందుకంటే.. రివర్స్ పంచ్ వెయ్యడానికి నందమూరి వైపు నుంచి కత్తులు నూరుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *