బాలీవుడ్‌లో ‘మన్మథుడు’

బాలీవుడ్ మళ్ళీ నాగ్‌కు వెల్‌కం చెప్పింది. చాలా ఏళ్ళ బ్రేక్ తరువాత ఈ హీరో ఓ బాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నాడు. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ‘ బ్రహ్మాస్త్ర’ మూవీలో అక్కినేని నాగార్జున ఓ కీలక రోల్ పోషించనున్నట్టు సమాచారం. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్ హీరో, హీరోయిన్లు కాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

 

గతంలో నాగ్ నటించిన శివ, ఖుదా గవా, క్రిమినల్, ఝక్మ్ వంటి హిందీ సినిమాలు హిట్ కొట్టాయి. 2003లో నాగ్ చివరిసారి నటించిన ‘ఎల్ఓసీ కార్గిల్’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఎంతో కాలంగా మంచి హిందీ చిత్రం చేయాలనుందని నాగ్ భావిస్తున్నాడని, బ్రహ్మాస్త్ర మూవీలో తన పాత్ర ఎంతగానో నచ్చిందని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పైగా తన అభిమాన నటుడు, క్లోజ్‌ఫ్రెండ్ కూడా అయిన అమితాబ్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్టు తెలుసుకున్న నాగ్..వెంటనే ఈ ప్రాజెక్టుకు ఓకె చెప్పాడట. ప్రస్తుతం నానితో ఓ మల్టీ స్టారర్ చేస్తున్న నాగార్జున త్వరలో ఈ హిందీ చిత్రం షూటింగ్ కోసం ముంబై వెళ్లనున్నట్టు తెలుస్తోంది.