తెలంగాణ టీడీపీ సీనియర్‌ నేత నామా నాగేశ్వరరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగావున్న ఆయన.. పార్టీకి, పొలిట్‌‌బ్యూరో సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేశారు. రేపోమాపో ఆయన టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైంది. మూడురోజుల కిందట ఆయన సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అక్కడ టికెట్ ఓకే చేసుకోవడంతో తెరాసలో చేరనున్నారు.

ఖమ్మం ఎంపీగా ఆయనను బరిలోకి దింపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులోభాగంగానే ఖమ్మం జిల్లాలోని అన్నినియోజకవర్గాల ఎమ్మెల్యేలతో నామా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన నామా.. టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ చేతిలో ఓటమి పాలైన విషయం తెల్సిందే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *