కోటితోపాటు పలువురు వ్యక్తులు తనపై ఇటీవల చేసిన దుష్ప్రచారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి డీజీపీకి ఫిర్యాదు చేశారు. తనను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని.. దీని వెనుక ఉన్న కుట్రలను ఛేదించాలని ఆమె పోలీసులను కోరారు. తన పరువు, మర్యాదలు కాపాడాలని తెలంగాణ డీజీపీకి విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని.. తనకు న్యాయం చేయాలని కోరారు.

తనపై ఆరోపణలు చేసిన కోటి అనే వ్యక్తిని బిడ్డగా భావించానన్నారు. తనను లక్ష్మీపార్వతి లైంగికంగా వేధిస్తోందంటూ గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన కోటి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ ఇది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *