ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు.. మంత్రి నారా లోకేశ్‌ మరో సారి అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పటికే పలు ప్రసంగాల్లో అక్షరదోషాలతో నెట్టింట్లో అతని మాటలు నవ్వులపాలవగా తాజాగా మరోసారి ఇలాంటి మాటలే మాట్లాడారు టీడీపీ యువనేత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే, మంగళగిరిలో టీడీపీ ఎన్నికల ప్రచారం చేస్తున్న నారా లోకేశ్‌ ఆదివారం రోడ్‌ షోలో మాట్లాడుతూ ‘పాపం వివేకానందరెడ్డి చనిపోయారు. ఆ విషయం తెలిసి పరవశించాం’ అనేశారు. అంతటితో ఆగలేదు లోకేష్.. ఏపీలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం తెలిసో తెలియకో పెద్ద ఎత్తున కంపెనీలను అమరావతికి తీసుకొచ్చిందని లోకేశ్‌ అన్నారు. దీంతో ఆ వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట్లో సందడిచేస్తోంది. చావువార్త విని పరవశించిపోయారా..?  పరవశించడం అనేది సంతోషకరమైన దానికి వాడాలని కూడా ఏపీ మంత్రికి తెలీదంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *