ఇండియాలో తమ కంటెంట్ల విషయంలో సెన్సారింగ్ చేసుకునేందుకు రెడీ అయ్యాయి నెట్ ఫ్లిక్స్, హాట్‌స్టార్. ప్రభుత్వ సెన్సార్‌షిప్‌ను నివారించుకోవడానికి తమకు తామే సెల్ఫ్ రెగ్యులేషన్ గైడ్ లైన్స్ రూపొందించుకునేందుకు ఇవి ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. దేశంలో సినిమా, టీవీ రంగాలకు సెన్సార్ బోర్డులంటూ ఉన్నప్పటికీ.. ఈ వీడియో స్ట్రీమింగ్ సాధనాలలో వచ్చే కంటెంట్‌కు సెన్సార్ తప్పనిసరి కాదు. తమ సిరీస్‌లలో ఎలాంటి మెటీరియల్ అయినా. వాటికి సెన్సార్ షిప్ అవసరం లేకుండా ఉంటూ వచ్చింది. అయితే ఆ మధ్య నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన  ‘శాక్రెడ్  గేమ్స్’ సిరీస్ మీద పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని కించపరిచేలా  ఈ సిరీస్ లో డైలాగులు, ఇతర సన్నివేశాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం కోర్టుల వరకూ వెళ్ళింది. ఇలాంటి పోకడ మరీ మితిమీరకుండా చూసేందుకు ప్రభుత్వమే జోక్యం చేసుకోవచ్చునని వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఈ రెండు సాధనాలూ ఓ అనధికారిక (ముసాయిదా) కోడ్‌ను అడాప్ట్ చేసుకోబోతున్నాయి. అభ్యంతరకరమైన  కంటెంట్ ను తామే కత్తిరించుకోనున్నాయి. అమెజాన్ ప్రైం వీడియో ఈ కోడ్ కు సంబంధించిన పత్రాలపై సంతకం చేయబోదని, అయితే ఈ నియమావళికి అనుగుణంగా నడచుకుంటామని హామీ ఇచ్చిందని తెలుస్తోంది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *