బీహార్ బస్సు ప్రమాదంలో ట్విస్ట్.. మృతుల సంఖ్య 'జీరో'

అవును.. బీహార్లో గురువారం జరిగిన ‘ఘోర’ బస్సు ప్రమాదంలో ఎవ్వరూ చనిపోలేదు. ముజఫర్ నగర్ నుంచి ఢిల్లీ వెళుతూ లోయలో పడిన ఈ ఏసీ బస్సులో ఆ సమయంలో కేవలం 13 మంది మాత్రమే వున్నారని, అందరూ కిటికీలు బద్దలుకొట్టుకుని సురక్షితంగా బయటపడ్డారని డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి దినేష్ చంద్ర యాదవ్ చెబుతున్నారు. కానీ.. నిన్న ఇదే ప్రమాదంలో మొత్తం 27 మంది మృత్యువాత పడ్డారని చెప్పిందీ ఈ పెద్దమనిషే. ప్రధాని, ముఖ్యమంత్రి సంతాపం కూడా తెలియజేశారు. ఇప్పుడేమైందయ్యా అంటే… ”అది ప్రాధమిక సమాచారం ప్రకారం చెప్పిన మాట. ఇది ఫైనల్ రిపోర్ట్” అంటున్నారాయన. 32 మంది ఈ బస్సుకి టిక్కెట్ బుక్ చేసుకున్న మాట నిజమే. కాకపోతే.. మిగతా వాళ్లంతా గోపాల్ గంజ్ అనే ప్రాంతంలో ఈ బస్సును ఎక్కాల్సి వుంది.