మంగళగిరి సమీపంలోని అమరావతి స్టేడియం వద్ద జరిగిన జ్యోతి దారుణ హత్యాచారం వెనుక పకడ్బందీ ప్లాన్ వేశారని అనుమానిస్తున్నారు. దాడి ఘటనకు ముందు జ్యోతి ప్రియుడు శ్రీనివాసరావు సెల్ ఫోన్ నుంచి అతని కొందరు స్నేహితులకు కాల్స్ వెళ్లాయని, వారే జ్యోతిపై అత్యాచారానికి పాల్పడ్డారని, శ్రీనివాసరావుపై అనుమానం రాకుండా ఉండేందుకు అతడ్ని కూడా కొట్టినట్టు నటించారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇది పరువు హత్య కూడా అయి ఉండవచ్చునన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావు బీసీ వర్గానికి, జ్యోతి ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారని తెలిసింది. అటు-తన చెల్లెలిని శ్రీనివాసరావు స్నేహితులతో కలిసి చంపించాడని జ్యోతి సోదరుడు ప్రభాకర్ ఆరోపిస్తున్నాడు. గతంలో తాను అతడ్ని హెచ్చరించానని, దాంతో కొంత కాలంగా దూరంగా ఉన్న అతడు ప్రేమ పేరిట తిరిగి జ్యోతికి దగ్గరయ్యాడని ప్రభాకర్ చెబుతున్నాడు. ఇంటి నుంచి జ్యోతిని బయటకు రప్పించడానికి శ్రీనివాసరావు నలుగురు అమ్మాయిల చేత ఆమెకు ఫోన్ చేయించాడని కూడా  తెలుస్తోంది. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *