న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన ఇటీవలి ఊచకోతల నుంచి అక్కడి సమాజం ఇంకా తేరుకోలేకపోతోంది. ప్రపంచం మొత్తం ఈ ఉన్మాదాన్ని ముక్తకంఠంతో నిరసిస్తోంది. మూడు మసీదులపై మెషిన్ గన్‌తో విరుచుకుపడి 50 మందిని కాల్చిచంపిన అతగాడిని ఉరితీసి చంపాల్సిందేనంటూ అన్ని వైపుల నుంచీ డిమాండ్లు వస్తున్నాయి. కానీ.. అదే కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన హోస్నే అహ్మద్ భర్త ఫరీద్ అహ్మద్ మాత్రం.. అతడ్ని క్షమించి వదిలేయాలని కోరుకుంటున్నాడు.

‘నా భార్యను పోగొట్టుకున్నాను. అయినా.. ఆ హంతకుడి మీద నాకు ఎటువంటి ద్వేషమూ, పగ లేదు’ అంటున్నాడితడు. ”ఒక మనిషిగా అతడ్ని నేను ఇష్టపడుతున్నాను. కానీ.. అతడు చేసిన పనిని మాత్రమే గర్హిస్తున్నాను. అతడి జీవితంలో ఏదో ఒక సందర్భం అతడ్నిలా ఉన్మాదిలా మార్చేసి ఉండవచ్చు. ఏదైనా ఘటనతో ఆవేదన చెంది.. ఆ కోపాన్ని ఎలా అణచుకోవాలో తెలీక అడ్డదారిలో పడ్డాడేమో..! అతడికి మళ్ళీ మంచి హృదయం కల్పించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా” అన్నారు.

ఈయన క్షమాగుణానికి గ్లోబల్ మీడియా కరిగిపోయి.. అతడి పెద్ద మనసును బాగా వైరల్ చేస్తోంది. సదరు ఉన్మాది మాత్రం.. ‘ముస్లిం వలసదారుల మీద నాకున్న ఉక్రోషం వల్లే ఇలా చేశా’నంటూ 74 పేజీల వాంగ్మూలమిచ్చి.. మరణశిక్షకైనా సిద్ధమంటూ జైల్లో కూర్చున్నాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *