మెగా హీరోయిన్ నిహారిక పెళ్లికి సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విషయమై మీడియాతో మాట్లాడారు ఆమె ఫాదర్ నాగబాబు. మంచి వ్యక్తి కోసం వెతుకుతున్నామని.. మంచి కుర్రాడైతే చాలని, కుటుంబ నేపథ్యం బాగా వుండాలన్నారు. తనకు కులం, మతంతో పెద్దగా పట్టింపులు లేవన్నారు. 2018 వరకు మా అమ్మాయికి టైమ్‌ ఇచ్చామని, 2019లో మ్యారేజ్ చేస్తామన్నారు.

సినిమాల్లోకి వచ్చినప్పుడు రెండుమూడేళ్ల తర్వాత మ్యారేజ్ చేస్తామని నిహారికకు చెప్పానని, సరే అని చెప్పిందన్నారు  నాగబాబు. నిహారిక ఫస్ట్ మూవీ ‘ఒక మనసు’. ఆ తర్వాత తమిళంలో నటించింది, మూడో సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్‌’. అది పెద్దగా ఆకట్టుకోలేదు, సూర్యకాంతం’తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మరి మ్యారేజ్ తర్వాత నటిస్తుందా? లేదా అన్నది చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *