దివంగత తమిళనాడు సీఎం జయలలిత బయో‌పిక్‌కు ‘ ది ఐరన్ లేడీ ‘ అనే టైటిల్ ను ఖరారు చేశారు. జయలలిత వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం చిత్రబృందం,,సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఈ లుక్‌లో నటి  నిత్యామీనన్ జయ పాత్రలో ఒదిగిపోయినట్టే కనిపిస్తోంది. ప్రియదర్శిని దర్శకత్వంలో..పేపర్ టేల్  పిక్చర్స్ ఈ చిత్రం నిర్మిస్తోంది. అటు-మదరసా పట్టణం మూవీ ఫేమ్ విజయ్ కూడా జయలలితపై ఓ బయో పిక్‌ను తెరకెక్కిస్తున్నాడు.ది ఐరన్ లేడీ మూవీ షూటింగ్ జోరుగా సాగుతున్నట్టు యూనిట్ వెల్లడించింది

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *