విలక్షణ నటుడు.. టాలీవుడ్ లెజెండ్‌గా చెప్పుకోదగ్గ మోహన్‌బాబు వయసు మరోసారి తగ్గిపోయింది. ఈ మార్చి 19కి 69 క్రాస్ చేసిన కలెక్షన్ కింగ్.. తాను ఇంకా నవయవ్వనస్తుడినేనంటూ మాటల ద్వారా, చేతల ద్వారా చూపెడ్తుంటారు. వయసు 70వ పడిలో పడుతున్నా.. ఇప్పటికీ సూపర్ యాక్టివ్‌గా ఉంటూ.. చెలాకీగా కనిపిస్తారు. ఇప్పటికింకా నా వయసు.. అంటూ చురుకైన భాష-యాసతో డైలాగులు చెబుతూ దూసుకుపోతారు.

ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు తన విద్యాసంస్థలతో బిజీగా గడుపుతున్న మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మోహన్ బాబు కూడా ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా జోరు పెంచేశారు.

మోహన్‌బాబులో ఈసారి ఒక వెలితి స్పష్టంగా కనిపిస్తోంది. సినీ, రాజకీయ, సామాజిక రంగాల్లో తనదైన పాత్రను పోషిస్తూ అన్ని కార్నర్స్ నుంచీ అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు.. తన తరువాతి తరాన్ని కూడా రాజకీయ రంగానికి పరిచయం చేద్దామని ఆశపడ్డారు. కొడుకు మనోజ్‌ని ఏదో ఒక పార్టీలో చేర్చి అసెంబ్లీకి పంపాలని చిన్న స్కెచ్ కూడా వేశారు. జగన్‌తో భేటీ కావడం ద్వారా వైసీపీ సపోర్టర్‌గా ముద్ర వేయించుకున్నారు. జనంలో తిరగడం కోసం కొడుకు మనోజ్‌ని తిరుపతికి పంపారు.

ఇంత జరిగినా.. వైసీపీ అభ్యర్థుల జాబితాలో ఎక్కడా మోహన్‌బాబు ఫ్యామిలీ ఊసే లేదు. మనోజ్‌కి చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే సెగ్మెంట్ ఇప్పించడం కోసం మోహన్ బాబు చేసిన లాబీయింగ్ మొత్తం వృధా అయింది. ఈసారి తన పుట్టినరోజున కొడుకు చేత నామినేషన్ వేయించాలని ఆశపడ్డ మోహన్‌బాబుకి నిరాశ తప్పలేదు. సన్నిహితుల వద్ద ఈ మేరకు ఆయన చెప్పుకుని వాపోయినట్లు వార్తలొస్తున్నాయి. ఎనీ హౌ.. లెటజ్ విష్ అవర్ వెర్సటైల్ యాక్టర్ మోహన్ బాబు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *