యూపీ సిఎంగా తాను  అధికార పగ్గాలు చేపట్టినప్పటినుంచి రాష్ట్రంలో మత ఘర్షణలే జరగలేదని, తన హయాంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరిసాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పుకున్నారు. దేశానికే ఈ రాష్ట్రం ఆదర్శ ప్రాయంగా నిలిచిందన్నారు. 2017 మార్చి నెలలో నేను సిఎం అయ్యాను. ఇప్పటికి నా ప్రభుత్వం రెండేళ్ళ కాలాన్ని పూర్తి చేసుకుంది..ఈ రెండేళ్లలో యూపీలో లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది. అంటూ ఓ రిపోర్టును సమర్పించిన ఆయన..అసలు వాస్తవాలను దాచిపెట్టారన్న విమర్శలు జోరందుకుంటున్నాయి. 2017‌లో ఈ దేశంలో 822 మత ఘర్షణలు జరగగా.. అందులో ఒక్క యూపీలోనే 195 నమోదయ్యాయని హోం శాఖ సహాయ మంత్రి హంసరాజ్ అహిర్ గత ఏడాది ఫిబ్రవరిలో లోక్‌సభలో తెలిపారు.

అసలు యోగి ఆదిత్యనాథ్ హయాంలో జరిగిన ఘర్షణలు,  దొమ్మీలు, మూక హత్యల విషయమే తెలుసుకుంటే..గత ఏడాది జనవరిలో కసన్ గంజ్ లో ఏబీవీపీ, వీహెచ్ పీ ఆందోళనకారుల దాడిలో ఓ యువకుడు మరణించగా..కొంతమంది గాయపడ్డారు. బులంద్ షహర్ ఘటనలో ఓ గుంపు జరిపిన ఎటాక్‌లో సుబోద్ కుమార్ సింగ్ అనే పోలీసు అధికారి, సుమిత్ కుమార్ అనే వ్యక్తి మరణించారు. గోసంరక్షకుల పేరిట హిందూ సంఘాలు మూక దాడులకు పాల్పడ్డాయి. 2017 లోనే సాహరన్ పూర్ జిల్లాలో దళితులపై అగ్రవర్ణ కులాల వ్యక్తులు దాడి చేయగా..ఒకరు ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయపడ్డారు. ఇంకా పోలీసుల రికార్డులకు ఎక్కని ఘటనలు చాలా ఉన్నాయని అంటున్నారు.   .

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *