తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతల్లో మార్పులు వచ్చాయి. ఇద్దరి అజెండా ఒక్కటే అయినప్పుడు కలిసి పోటీ చేయడం కన్నా, విడివిడిగా బరిలో నిలవడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్టు ఢిల్లీ సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న అన్ని రాష్ర్టాల పీసీసీ అధ్యక్షుల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతలకు ఈ విధంగా దిశానిర్దేశం చేసినట్టు అంతర్గత సమాచారం. రాష్ట్రాల్లో విడిగా పోటీ చేసినా దేశ ప్రయోజనాల కోసం కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి నడవాలని నిర్ణయానికి వచ్చినట్టు నేతలు చెబుతున్నారు.

అటు సీఎం చంద్రబాబు కూడా ఇదే సంకేతాలను పార్టీ కేడర్‌కు ఇచ్చారు. ప్రజల మనోభావాలకు తగ్గట్టుగానే ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రెండురోజుల కిందట ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు, రాహుల్‌తో ఈ విషయమై చర్చించారు. కాంగ్రెస్‌ వ్యతిరేక భావజాలంతో పుట్టిన పార్టీలు కావడంతో ఏపీలో టీడీపీ, బెంగాల్‌లో టీఎంసీలకు ఇబ్బంది వస్తుందనేది వాళ్ల ఆలోచన. ఈ లెక్కన ఏపీలో ఎవరి దారి వారిదే అన్నమాట.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *