మహిళా సాధికారతను అమెరికాలోని భారతీయ వనితాలోకం చాటిచెప్పింది. వివిధ రంగాల్లో మహిళల అభివృద్ధి, సమసమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ధైర్యంగా ముందుకు సాగేలా ఉత్తేజిత ప్రసంగాలతో వేదికను కనుల పండుగ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా నార్త్ కరొలినాలోని రాలీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కనిపించిందీ దృశ్యం. ఈ కార్యక్రమంలో అమెరికాలోని ఎన్నారై మహిళలు భారీగా పాల్గొని ఆటపాటలు, స్టేజ్ మీద డ్యాన్సులు, గేమ్ షోలతో ఆకట్టుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *