ప్రతీ తెలుగువాడి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నాడు నటుడు తారకరత్న. నందమూరి తారకరామారావు లైఫ్ స్టోరీ ఆధారంగా బుధవారం రిలీజైన మూవీ ‘ఎన్టీఆర్-కథానాయకుడు’. అన్నివర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో నందమూరి అభిమానులు ఫుల్‌ఖుషీ!

ఈ చిత్రానికి అమెరికాలోనూ మాంచి టాక్ వచ్చింది. న్యూజెర్సీలో అక్కడి తెలుగువాళ్లతో కలిసి సినిమా చూసి ఆనందం వ్యక్తంచేశాడు నటుడు తారకరత్న. భౌతికంగా ఎన్టీఆర్ ఇక్కడ లేకపోవచ్చుగానీ, తెలుగువాళ్ల గుండెల్లో వుంటారన్నాడు.

ఎన్టీఆర్ సినిమాని వాళ్ల ఫ్యామిలీ సభ్యులతో కలిసి చూడడం మరిచిపోలేని అనుభూతిని మిగిల్చిందని తెలుగు ఆడియన్స్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ గురించి తెలియని చాలా విషయాలు ఇందులో ప్రస్తావించారని, ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ క్రిష్‌దేనని తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *