‘ఎన్టీఆర్ మహానాయకుడు’ మూవీ ప్రమోషన్ జోరుగా సాగుతోంది. తాజాగా చంద్రబాబు రోల్‌కి సంబంధించి రానా మేకింగ్ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం అప్పటివరకు పెంచుకున్న గెడ్డాన్ని రానా తొలగించాడు. పూర్తిగా తన మేకోవర్‌ని మార్చేశాడు. ప్రతీ సన్నివేశంలోనూ రానా కంటే రియల్‌గా చంద్రబాబు కనపడేలా ప్రయత్నించాడు డైరెక్టర్ క్రిష్. రానా.. చంద్రబాబులా ఎలా మారారు? వంటి విషయాలను ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్తున్న సందర్భంలోనిది ఆ సీన్. మహానాయకుడు’లో రానా పాత్ర కీలకమని తొలి నుంచి యూనిట్ చెబుతూ వస్తోంది. ఈ మేకింగ్ వీడియోతో అంచనాలు రెట్టింపయ్యాయి.

నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’. తాజాగా దీనికి సంబంధించిన స్మాల్ ప్రోమోని రిలీజ్ చేసింది. ‘నా ప్రాణాలకు ప్రాణంగా.. నా బిడ్డలకు తల్లిగా.. నా సహధర్మచారిణిగా.. నీ అనుమతి కావాలి తారకం..ఇష్టమేనా?’ అంటూ విద్యాబాలన్‌‌తో బాలకృష్ణ చెప్పే డైలాడ్ అది. ‘నీకూ నాకూ రెండు ఇష్టాలుంటాయా బావా..’ విద్యాబాలన్‌ చెప్పడం ఇందులో హైలైట్‌! క్రిష్‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమా, శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *