ఎన్టీఆర్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సెకండ్ పార్ట్ ‘మహానాయకుడు’ శుక్రవారం తెలుగు రాష్ర్టాలతోపాటు విదేశాల్లో కూడా భారీ ఎత్తున రిలీజైంది. నటుడిగా ఎన్టీఆర్ ‘క‌థానాయ‌కుడు’ ఫిల్మ్ వస్తే.. ఆయ‌న రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో మ‌హానాయ‌కుడు వచ్చింది. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యిందో లేదో తెలియాలంటే రివ్యూలోకి వెళ్దాం.

స్టోరీ..

తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నాను అనే ఎన్టీఆర్ (బాలకృష్ణ) ప్రక‌ట‌నతో బయోపిక్ సెకండ్ పార్ట్ మొదలవుతుంది. కేవలం 9 నెల‌ల్లోపే అఖండ విజయం సాధిస్తారు. ప్రజలకు తను ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని ఎన్నో మంచి పనులు చేస్తారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ ప్రభుత్వానికి ఆటంకాలు మొదలవుతాయి. కొంతమంది నేతల స్వార్ధపూరిత ఆలోచనల కారణంగా ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుండి దింపేస్తారు. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఎన్టీఆర్ ఎలా ముఖ్యమంత్రి అయ్యారు? ఎన్టీఆర్ తిరిగి సీఎం కావడంలో చంద్రబాబు పాత్ర ఏంటి? అలాగే భార్య బసవతారకం ప్రాధాన్యత ఎంత? లాంటి విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే!

విశ్లేషణ..

మహానాయకుడుకి ప్రధాన బలం బాలకృష్ణ. ఎన్టీఆర్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. ఓ వైపు రాజ‌కీయ నాయకుడిగా, మరోవైపు భ‌ర్తగా బాల‌కృష్ణ రెండు ర‌కాల వేరియేషన్స్ చూపించాడు. ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే ఆటంకాలు మొదలవుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సుని త‌గ్గించ‌డంతో విమ‌ర్శలను ఎదుర్కోవాల్సివస్తుంది. నాదెండ్ల భాస్కరరావు న‌మ్మించి మోసం చేయడం, సీఎం కుర్చీ నుంచి దింపడం వంటి అంశాలను సెకండాఫ్‌లో ఆసక్తికరంగా మ‌లిచాడు క్రిష్‌. ఇందిరాగాంధీ నియంతృత్వ విధానాల‌పై పోరాటం వంటి స‌న్నివేశాల‌ు ర‌క్తిక‌ట్టిస్తాయి. స్టోరీ కేవ‌లం రాజ‌కీయాల‌కు ప‌రిమితం కాకుండా భార్య బ‌స‌వ‌తార‌కంతో ఆయ‌న‌కున్న అనుబంధాన్ని టచ్ చేశాడు. ఈ రెండింటినీ స‌మాంత‌రంగా తెర‌పై చూపించాడు. విద్యాబాల‌న్ న‌ట‌న బ‌స‌వ‌తార‌కం పాత్రకు వ‌న్నె తెచ్చింది. నాదెండ్ల పాత్రలో స‌చిన్ ఖేడేక‌ర్ కుదిరిపోయాడు. చంద్రబాబు పాత్రలో రానా ఆక‌ట్టుకున్నాడు. ఏఎన్నార్‌గా సుమంత్‌ని ఒకే ఒక్క సీన్‌కి ప‌రిమితం చేశాడు.

హరికృష్ణ రోల్‌లో క‌ల్యాణ్‌రామ్ అక్కడ‌క్కడ క‌నిపిస్తాడు. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావుగా భ‌ర‌త్‌, ఎన్టీఆర్ బావ‌మ‌రిదిగా వెన్నెల కిశోర్ ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు. కొన్ని సీన్స్‌ని నేరెట్ చేయడంలో ల్యాగ్ కనిపించింది. చంద్రబాబు పాత్రకు సంబంధించిన సీన్స్‌ను వాస్తవ దూరంగా చూపించిన భావన కలుగుతుంది. ఎన్టీఆర్ చివ‌రి మ‌జిలీని విస్మరించాడు. బయోపిక్ కాబట్టి ఎలాంటి రెగ్యులర్ కమర్షియల్ అంశాలను ఆశించకూడదు. భారీ అంచనాలు పెట్టుకుంటే నిరాశ తప్పదు. మొత్తమ్మీద ఎన్టీఆర్ అభిమానులకు బాగా నచ్చుతుంది. మిగిలిన వర్గాల ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *