‘ఆర్ఆర్ఆర్’ తన కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌ మూవీగా మిగిలిపోతుందన్నాడు ఎన్టీఆర్. జక్కన్నతో తాను పని చేయడం నాలుగోసారని, అన్నింటికంటే ఈ చిత్రం చాలా ప్రత్యేకమైనదని తెలిపాడు. దీనికితోడు చెర్రీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం మరో విశేషంగా చెప్పుకొచ్చాడు. మాకు ఎలాంటి దిష్టి తగల కూడదన్నాడు. అల్లూరి, భీం గురించి తెలిసిన గీత ఒకటి వుందని, వారిద్దరు మనకు తెలియని గీత గురించి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో చూస్తారన్నాడు.

ఇప్పటివరకు చేసిన 28 సినిమాల కంటే.. ఆర్ఆర్ఆర్ కోసం తీసుకున్న ట్రైనింగ్ మా భవిష్యత్‌ సినిమాలకు ఎంతో సహాయపడుతుందన్నాడు. రాజమౌళి బుర్రలో పుట్టిన ఈ ఆలోచన.. ఓ గొప్ప చిత్రంగా ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసమన్నాడు. గురువారం మధ్యాహ్నం రామ్‌చరణ్‌, రాజమౌళి, నిర్మాత దానయ్యలతో కలిసి ఎన్టీఆర్‌ పైవిషయాలను వెల్లడించాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *