జనసేనలో ‘నంబర్ టూ’గా పేరున్న నాదెండ్ల మనోహర్ బెర్త్ ఎట్టకేలకు ఖరారైంది. పార్టీలో కీలక బాధ్యతలు మోస్తూ, పవన్ కళ్యాణ్‌కి అడుగడుగునా నైతిక బలాన్నిస్తూ దూస్తుకెళ్తున్న నాదెండ్ల మనోహర్ వచ్చే ఎన్నికల్లో తెనాలి ఎమ్మెల్యే సెగ్మెంట్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు.

నిజానికి.. తెనాలి నాదెండ్ల సొంత అడ్డా! ఆయన తెనాలి బరిలో నిలుస్తారన్న విషయం కూడా అనూహ్యం కాదు. అయితే.. నాదెండ్లకుండే కరిష్మాను, స్వభావరీత్యా ఆయన పట్ల జనానికుండే సానుకూలతను భారీగా వాడుకోవాలని జనసేన భావించింది. గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేయించాలన్నది నాదెండ్ల మీద పవన్‌కున్న మొట్టమొదటి ఐడియా. రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం కలిగి, జాతీయ రాజకీయాల్లో కూడా ఎంతోకొంత పరిచయం వున్న నాదెండ్లను ఢిల్లీ సర్కిల్స్‌లో పెట్టాలని పవన్ భావించారు.

తనను రెండు సార్లు గెలిపించి రాష్ట్రస్థాయి నాయకుడిగా అవకాశమిచ్చిన తెనాలి మీదే నాదెండ్లకి గురి ఉందని, ఆయన కోరిక మేరకు ‘తెనాలి’నే ఫైనల్ చేశారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌లకు జనసేన అభ్యర్థిత్వం నుంచి ఈసారి గట్టి పోటీ తప్పదన్నది క్లియర్!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *