సౌందర్యాభిలాష కలిగినవాళ్లకు ఇదొక లవ్లీ ఛాన్స్! ఇరవయ్యేళ్ళ తర్వాత మనం ఎలా వుంటాయో, మన ముఖవర్ఛస్సులో ఏమేం మార్పులొస్తాయో ఖచ్చితంగా తేల్చిచెప్పే ‘సాధనం’ ఒకటి వచ్చేసింది. Future You Simulation పేరుతో ఒక మొబైల్ యాప్‌ని డెవలప్ చేసింది బ్యూటీషియన్ కంపెనీ ఓలే. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పని చేసే ఈ యాప్ ద్వారా.. కస్టమర్ల ‘అవసరాన్ని’ తీర్చడంతో పాటు వాళ్ళ బలహీనతను మరింత బాగా క్యాష్ చేసుకుంటోంది ఓలే.

ఈ యాప్‌‌లోకి యూజర్లు ఒక్క సెల్ఫీ అప్లోడ్ చేసి.. వాళ్ళ వయసును, ప్రాంతాన్ని, జాతిని చెబితే చాలు. ఈ డీటెయిల్స్‌ని ఉపయోగించుకుని కృత్రిమ మేధస్సు ద్వారా.. చర్మం యొక్క స్వభావాన్ని అంచనా కడ్తుంది. అనుకరణ పధ్ధతి ద్వారా చర్మపు ముడుతల్ని, మచ్చల్ని, చర్మం వెలిసిపొయ్యే అవకాశాల్ని బేరీజు వేసి.. ఆ చర్మపు భవిష్యత్తు ఏమిటన్నది తేల్చేస్తుందట. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తవగానే.. 20 ఏళ్ల ముందు మీరెలా వున్నారు.. 20 ఏళ్ల తర్వాత ఎలా వుండబోతారన్న కాలిక్యులేషన్ మీకు దొరికేసినట్లే.

గతానికి, ఇప్పటికీ, భవిష్యత్తుకి మీ మోహంలో వచ్చిన, రాబోయే మార్పుల్ని ఈ విధంగా చూసుకోవచ్చు. ఏఏ స్పాట్స్ మీ వయసుని ‘పెంచేస్తాయో’ పసిగట్టి.. వాటిని సరిచేయడం ఓలే కమర్షియల్ ఫార్ములా. ‘మీరు ఇప్పుడున్నట్లే ఎప్పటికీ యూత్‌ఫుల్‌గా కనిపించాలంటే.. ఫలానా టిప్స్ పాటించాలి’ అంటూ కస్టమర్లను ఎలర్ట్ చేయవచ్చంటున్నారు ఓలే స్కిన్ అడ్వైజర్స్. వెయ్యికిపైగా క్లినికల్ సెల్ఫీస్‌ అప్లోడ్ చేసి ఒక స్థిరమైన డేటాబేస్ ద్వారా ఈ యాప్‌ని దిగ్విజయంగా పరీక్షించారు. లాస్ వేగాస్‌లో జరుగుతున్న ‘కన్స్యూమర్స్ ఎలక్ట్రానిక్స్ షో’ వేదికపై ప్రదర్శనకు పెట్టిన ఈ యాప్.. గ్లామర్ వరల్డ్‌ని కూడా అమితంగా ఆకట్టుకుంటోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *