త్రివిక్రమ్-తారక్.. టైటిల్ మళ్ళీ మారింది.. A..S..R..

త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ తారక్ చేస్తున్న అడ్వెంచరస్ ప్రాజెక్టు క్లయిమాక్స్ దశకు చేరుకుంది. సినిమా దాదాపుగా పూర్తయినప్పటికీ.. టైటిల్ దగ్గరే తెగ కసరత్తు చేస్తోంది టీమ్. ‘అ’ అనే అక్షరంతో మొదలవ్వాలని, అచ్చతెలుగులో ఉండాలని, కొత్తగా అనిపించాలని.. ఇలా లెక్కకుమించి షరతుల్ని పెట్టుకున్న త్రివిక్రమ్.. టైటిల్ మీద ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. నిన్నటివరకూ ‘అసామాన్యుడు’ అనే టైటిల్ గురించి ఫీలర్లు బైటికొచ్చాయి.

కానీ.. చప్పగా ఉందంటూ ఫీడ్‌బ్యాక్ రావడంతో వెనక్కు తగ్గిందట యూనిట్. తాజాగా.. మరో వినూత్నమైన టైటిల్ సోషల్ మీడియాలో ‘సౌండ్’ చేస్తోంది. ‘అరవింద సమేత రాఘవ’ అనేది తారక్ మూవీకి యాప్ట్ టైటిల్ అని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారట. దీంతో పాటు.. ఇందులో అరవింద ఎవరు.. ఏమిటి.. అన్న క్యూరియాసిటీ కూడా బిల్డ్ అయింది. కానీ.. కానీ, మే 20న బర్త్ డే సందర్భంగా అఫీషియల్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉందని, అంతవరకూ ఫ్యాన్స్ ఆవేశపడొద్దని తారక్ చెబుతున్నారట. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్దె, శ్రద్ధా కపూర్ ఇద్దరు హీరోయిన్స్.