శ్రీకాంత్.. ‘ఆపరేషన్ 2019’ ట్రైలర్

శ్రీకాంత్ నటించిన మూవీ ‘ఆపరేషన్ దుర్యోధన’ ఎంత పెద్ద హిట్టయ్యిందో చెప్పనక్కర్లేదు. ఈసారి ఆ తరహా పొలిటికల్ జానర్‌తో వస్తున్నాడు ఈ హీరో. ‘ఆపరేషన్ 2019’ టైటిల్ ఫిక్స్ కాగా, ‘బివేర్ ఆఫ్ పబ్లిక్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రానికి సంబంధించి రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఇది ఆపరేషన్ దుర్యోధనను మించిన పొలిటికల్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. ఈసారి కూడా సీరియస్ రాజకీయ నాయకుడి పాత్రలో శ్రీకాంత్ దుమ్ముదులిపేలా కనిపిస్తున్నాడు.

తన కాలికున్న చెప్పు ఊడిపోతే.. దాన్ని తీయబోయిన పోలీస్ అధికారిని చెంప చెల్లుమనేటట్టు సీన్ ట్రైలర్‌కే హైలైట్! పోసాని కామెడీ, దీక్షాపంత్ గ్లామర్ సినిమా ప్లస్! గాంధీ కడుపున గాంధీ పుట్టడు.. ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు.. మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా ప్రజల్లో నుంచి పుట్టుకురావాల్సిందే అన్న డైలాగ్ బాగుంది. కరణం బాబ్జి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అలివేలమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది.