ఎయిర్ లైన్స్ చరిత్రలో ఇదో వింత.. సౌదీ రాజధాని జెడ్డా నుంచి మలేసియాకు బయల్దేరిన సౌదీ ఎయిర్ లైన్స్ విమానమొకటి తిరిగి రివర్స్‌లో సౌదీ విమానాశ్రయాన్ని చేరుకోవాల్సి వచ్చింది. ఇందుకు ఓ తల్లి తన బిడ్డను డిపార్చర్ లాంజ్ లో మరచిపోవడమే.. ఎక్కడా,,ఎప్పుడూ జరగని ఇలాంటి ఘటన విమాన సిబ్బందికి, అధికారులకు ఆశ్చర్యం కలిగించింది. ‘ నా బిడ్డను లాంజ్ లో మరచిపోయా.. దయచేసి విమానాన్ని వెనక్కి తిప్పండి ‘ అంటూ ఆ తల్లి కేబిన్ సిబ్బందిని ప్రాధేయపడింది. దీంతో పైలట్.. ప్లేన్ ని మళ్ళీ సౌదీ ఎయిర్ పోర్టుకు తీసుకువెళ్లేందుకు పై అధికారుల అనుమతి తీసుకోవలసి వచ్చింది.


కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన అరబ్ దేశాలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ తల్లి పైలట్‌ను ఇలా కోరడం, పైలట్ అధికారుల అనుమతి కోరడం అంతా ఆన్ లైన్ లో షేర్ అయి అందర్నీ విస్మయానికి గురి చేయగా.. ఏవియేషన్ సిబ్బంది అంతా అయోమయంలో పడిపోయారు. ఇంతకీ ఈ విమానం రన్ వే పై వెళ్తుండగా ఈ ఘటన జరిగిందా లేక గాల్లోకి ఎగిరాక జరిగిందా అన్న విషయం తేలాల్సి ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *