పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ తెరంగేట్రం చెయ్యడానికి తహతహలాడుతోంది. గతంలో పవన్ సరసన బద్రి, జానీ సినిమాల్లో చేసింది. తర్వాత పూర్తిగా తెరమరుగైన రేణు.. కుటుంబంతోనే ఎక్కువగా స్పెండ్ చేయాలని డిసైడ్ అయింది. వైవాహిక జీవితంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి కూడా. ఈ గ్యాప్‌లో బుల్లితెర మీద కొన్నాళ్ళు మెరిసింది. ఇప్పుడు నేరుగా వెండితెరనే టార్గెట్ చేసిందట రేణు దేశాయ్.

పవన్ కళ్యాణ్ లైఫ్ పార్టనర్‌గా ఆమెకున్న పాపులారిటీని వాడుకోవడం కోసం అనేకమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ప్రయత్నించారు. వదిన, పిన్ని, అక్క పాత్రల్లో చేసిచేసి అలసిపోయిన నదియా, ఖుష్బూ, రమ్యకృష్ణల ప్లేస్‌ని రేణుతో పూర్తి చేసుకోవాలన్నది వీళ్ళ ప్రయత్నం. కానీ.. ఆమె తిరస్కరించడంతో అవన్నీ వెనక్కెళ్ళిపోయాయి. ఇప్పుడు.. ఒక యువ హీరోకి అక్కగా చెయ్యడానికి రేణు ఒప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ డైరెక్షన్లో రాబోయే మూవీ కోసం రేణు దేశాయ్ కాల్షీట్స్ ఇచ్చారని, మంచి ప్రాధాన్యమున్న పాత్ర కావడం వల్లే ఆమె ఒప్పుకున్నారని తెలుస్తోంది. ‘అల్లుడు శీను’కి ఎలాగైనా బ్రేక్ తీసుకురావాలన్న కసితో పని చేస్తున్న ‘బెల్లంకొండ బ్యాచ్’ ఇందుకోసం ‘పవన్ కళ్యాణ్ భార్య’ అనే కమర్షియల్ ఎలిమెంట్‌ని వాడుకోడానికి సిద్ధమనట్లుంది. దాదాపు పదిహేనేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరకు మళ్ళీ మేకప్ వేసుకుంటున్న రేణు దేశాయ్‌లో అప్పటి ‘ఈజ్’ ఉంటుందా..? నటిగా మరోసారి ప్రూవ్ చేసుకోగలదా? అనే సంశయం కూడా వుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *