పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘పీపుల్ స్టార్’గా రీషేప్ అయ్యే క్రమంలో మొట్టమొదటి ఘట్టం షురూ అయింది. దాదాపు పదేళ్ల కిందటే ఆయన పొలిటికల్ అరంగేట్రం చేసినప్పటికీ, మొదట్లో ప్రజారాజ్యం పార్టీకి, తర్వాత తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేసినప్పటికీ.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. గత ఎన్నికలకు ముందే సొంత పార్టీ పెట్టినప్పటికీ ప్రజాక్షేత్రంలో దిగి తనకోసం ఓట్లు అడుక్కున్న సందర్భం లేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా.. విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. పవన్ పొలిటికల్ జర్నీలో ఇదొక ల్యాండ్ మార్క్ సిట్యువేషన్.

గాజువాకలోని జీవీఎంసీ 5వ జోనల్ ఆఫీసులో నామినేషన్ వేయడానికి పవన్ వెళ్ళినప్పుడు.. ఆయన వెంట వేలాదిమంది జనసైన్యం నడిచింది. బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీల క్యాడర్ కూడా పవన్ నామినేషన్ ఘట్టంలో సందడి చేసింది. తర్వాత గాజువాకలోని శంఖవరం, భీమునిపట్నం, విశాఖ సౌత్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్. పోలింగ్ తేదీకి మరో 18 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఇకనుంచి ప్రచార పర్వాన్ని వేగవంతం చేయనున్నారు పవన్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *