తెలంగాణ జనసేన ‘ఓటు’పై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. విచక్షణ మేరకు ఓటెయ్యాలంటూ పార్టీ క్యాడర్ కి, అభిమానులకు పిలుపునిచ్చారు. ఫలానా పార్టీని బలపర్చాలన్న స్పష్టతనివ్వకపోయినా.. ‘ఎక్కువ పారదర్శకత కలిగి, తక్కువ అవినీతికి పాల్పడే’ పార్టీకి ఓటేయాలన్నారు. తక్కువ సమయం ఉన్నందున తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని ఇదివరకే ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఆ విషయంపై మరోసారి క్లుప్తంగా వివరణ ఇచ్చుకున్నారు. ‘కోటి రతనాలవీణ మన తెలంగాణ’ అంటూ దాశరధి చెప్పిన మాటల్ని గుర్తుచేస్తూ.. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది ఎవరైనా దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనమీద వుంది అన్నారు. జై తెలంగాణ అంటూ తన ‘సందేశాన్ని’ ముగించారు.

జనసేన లాగే పోటీకి దూరంగా వున్న వైసీపీ కూడా ఇటువంటి పిలుపే ఇచ్చింది. కాకపోతే.. తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా దాని ఉనికిని దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యమని చెబుతూ అధికారపార్టీకి పరోక్ష మద్దతు ప్రకటించింది వైసీపీ. పవన్ కళ్యాణ్.. ఆ మాత్రం కూడా బెండ్ కాకుండా మధ్యేమార్గంలోనే నిలబడ్డారు. అయితే.. ఏపీలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్ని దునుమాడుతున్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణాలో కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్.. ఆ రెండు పార్టీల్ని త్యజించి.. తెరాస వైపే మొగ్గుచూపుతారన్నది సుస్పష్టం. ఎటుతిరిగీ.. జనసేన, జగన్‌ల వైఖరితో లాభపడేది కేసీఆరే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *