ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు  కేసీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటీవలకాలంలో జగన్‌ను టీఆర్ఎస్ నేతలు కలవడం, ఆ పార్టీ నేతలు ఏపీకి వచ్చి మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతోంది. అంతర్గతంగా జగన్‌కు టీఆర్ఎస్ మద్దతు పలుకుతోందని ఏపీ ఓటర్లు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలంటే.. టీఆర్ఎస్ దొడ్డిదారిన కాకుండా రాజమార్గంలో రావాలని ఆయన హితవు పలికారు. రాయలసీమ ఫ్యాక్షనిస్టులంటూ జగన్‌ని రాళ్లతో తరిమికొట్టిన టీఆర్ఎస్, ఇప్పుడు ఆయనకు ఎలా మద్దతు ఇస్తుందని ప్రశ్నించారు.

గతరాత్రి విశాఖలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన పవన్ కల్యాణ్, ఆంధ్రులను తిట్టిన కేసీఆర్‌ను.. జగన్ ఎందుకు వెనుకేసుకు వస్తున్నారని నిలదీశారు. ఆంధ్రోళ్లు దోపిడిదారులంటూ పదేపదే ప్రస్తావిస్తున్న కేసీఆర్, ఏపీలో ఏ ఒక్క నాయకుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు. తనను సీఎం చేయాలని ఓటర్లకు పిలుపునిస్తున్న జగన్.. కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ ఫ్యాక్షన్ వల్ల మా తెలంగాణ నష్టపోతుందని తెలంగాణ నుంచి జగన్‌ని తరిమేశారు కేసీఆర్. జగన్ వస్తే వరంగల్‌లో రాళ్లతో కొట్టించి మీరు.. అలాంటి వ్యక్తికి మీరు వెనుకాన నుంచి మద్దతు పలకడం ఏంటని ధ్వజమెత్తారు. చంద్రబాబును ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఏపీకి వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు. కానీ, జగన్‌కి మద్దతు ఇస్తే స్వాగతించమని తేల్చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *