ఎట్టకేలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఒక్క సీటుకే పోటీ చేయాలని తొలుత పవన్ భావించారు. తాను రేసులో లేకపోతే ఉభయగోదావరి జిల్లాలో కేడర్ డీలా పడుంతుందని భావించిన అధినేత, మరో నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు పార్టీ సమాచారం. ఒకటి గాజువాక కాగా, మరొకటి భీమవరం. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి ముమ్మరంగా కసరత్తు కూడా చేశాడు. ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడి అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుని మరో నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నాడు.

పవన్ తన దృష్టంతా ఉత్తరాంధ్ర- కోస్తాపైనే వున్నట్లు తెలుస్తోంది. గతంలో అనంతపురం జిల్లా నుంచి బరిలోకి దిగుతానని పలుమార్లు చెప్పినప్పటికీ.. ఎందుకోగానీ ఆయన తన ఆలోచనను విరమించుకున్నాడు. సీమ కంటే కోస్తాయే బెటరని ఓ ఆలోచనకు వచ్చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేనకు కేడర్ వుండడం తోపాటు తన సామాజికవర్గం మద్దతు కూడా కలిసి వస్తుందన్నది ఓ అంచనా! 2009లో చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ తరపున తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి పోటీకి దిగారు. తిరుపతి నుంచి గెలుపొందగా, పాలకొల్లు నుంచి ఆయన ఓడిపోయిన విషయం తెల్సిందే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *