గాజుగ్లాసును దక్కించుకుని వేడి మీదున్న జనసేన.. ఆ ఊపును కొనసాగించే పనిలో పడింది. వారం రోజులుగా జిల్లాల వారీ సమన్వయకర్తలతో ఎడతెరిపి లేకుండా భేటీలు జరుపుతున్న అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. పార్టీ ఒరిజినల్ స్ట్రెంత్ ఎంతన్న స్టాటిస్టిక్స్ రాబట్టగలిగారు. ఇప్పటికే పొత్తులపై కూడా స్పష్టతనిచ్చేశారు కనుక.. నియోజకవర్గ స్థాయి క్యాడర్‌లో గందరగోళం పూర్తిగా తగ్గిపోయింది. తెలుగుదేశం, వైసీపీలకు సమాన దూరం పాటించాలన్న ఎత్తుగడతో పటిష్టమైన ప్రత్యామ్నాయ వేదిక వైపు జనసేన అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలోనే ఏపీ సీపీఎం నేత మధు.. థర్డ్ ఫ్రంట్‌పై క్లారిటీ ఇచ్చేశారు. తెలుగుదేశం, వైసీపీలకు దీటైన ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్ ఒక్కడేనన్నారు. చంద్రబాబుతో అసంబద్ధ స్నేహం చేసి కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందని, అగ్రవర్ణాల పాటెత్తుకున్న బీజేపీ దళిత, వెనుకబడిన వర్గాల్ని దూరం చేసుకుందని చెప్పుకొచ్చారు. ఈ సెక్షన్స్ అన్నిటినీ దగ్గర చేసుకోగల సత్తా జనసేన-వామపక్షాల కూటమికి మాత్రమే ఉందని ధీమా వ్యక్తం చేసిన మధు.. ఈనెల 18 నుంచి 20 వరకు పవన్‌తో కీలక చర్చలు జరపనున్నట్లు చెప్పారు. తమకు ఏఏ నియోజకవర్గాలు దక్కుతాయన్న స్పష్టత అక్కడే వచ్చేస్తుందని, 20న జనసేన తరపున ‘పొత్తు ప్రకటన’ వెలువడవచ్చని మధు చెప్పారు.

ఇదిలా ఉంటే.. సంక్రాంతి సంబరాల కోసం పవన్ కళ్యాణ్ ఈనెల 13న తెనాలి వెళ్లనున్నారు. నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో అక్కడ సినిమాటిక్‌గా జరిగే పొంగల్ సెలబ్రేషన్స్‌లో పవన్ కళ్యాణ్ జోష్ నింపే ఛాన్సుంది. మహిళా కార్యకర్తలతో కలిసి సంక్రాంతి పాటకు పవర్ స్టార్ చిందేస్తారని కూడా తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *