జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఓ విషయాన్ని సస్పెన్స్‌లో పెట్టుకుంటూ వస్తున్నాడు. దీంతో పార్టీ కార్యకర్తల్లో టెన్షన్ పెరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు? ఏ జిల్లాను ఆయన ఎంచుకుంటాడు? అనేది కొన్నాళ్లుగా నలుగుతోంది. ఆ మధ్య అనంతపురం జిల్లా వెళ్లినప్పుడు ఇక్కడి నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ బహిరంగంగా ప్రకటించాడు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా వంతైంది. ఇటీవలకాలంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలపైనే ఫోకస్ చేశాడు పవన్. ఆ సందర్భంలో వల్లభుడి ఆజ్ఞతో పిఠాపురం నుంచి పోటీ చేస్తానేమోనని సూచనప్రాయంగా చెప్పుకొచ్చాడు.

సీన్ కట్ చేస్తే.. గురువారం అనంతపురం వచ్చిన పవన్.. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెబుతానన్నాడు. మొదట పవన్ పోటీ గురించే ప్రధానంగా చర్చించుకున్న కార్యకర్తలు, అభిమానులు.. ఆయన మాటల్ని తేలిగ్గా తీసుకోవడం మొదలుపెట్టారు. తూర్పులో కుల సమీకరణం కలిసొస్తుందని, సీమలో అయితే అభిమానులు ఎక్కువగా వుంటారని వాటిని ఓట్ల రూపంలో మలచుకోవాలని భావిస్తున్నాడని విశ్లేషకుల మాట. నేతల వలసలను బట్టి ఉత్తరాంధ్రలో కూడా పవన్ పోటీ చేసే ఛాన్స్ వుందని సేన కార్యకర్తలంటున్నారు. 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ర్టాల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్, చివరి నిమిషంలో తెలంగాణ నుంచి డ్రాపయ్యాడు. ఆయన ఏపీకే పరిమితమయ్యాడు. సొంత నియోజకవర్గంలో విషయంలో కూడా ఇదే ఫార్ములాని ఫాలో అయినా కార్యకర్తలు ఆశ్చర్యపోనక్కర్లేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *