విశాఖలోని గాజువాక జనసేన అభ్యర్థిగా గురువారం నామినేషన్‌ దాఖలు చేశాడు పవన్‌కల్యాణ్‌. ఈ క్రమంలో తన ఆస్తుల చిట్టాను అఫిడవిట్‌లో ప్రస్తావించాడు. తన చర, స్థిర ఆస్తులు రూ. 52 కోట్ల వున్నట్లు ప్రకటించాడు. అందులో చరాస్తులు- రూ.12,00,48,393, స్థిరాస్తులు- రూ.40,81,16,987 కోట్ల రూపాయలు. అప్పులు రూ. 32.40 కోట్లకు పైగా వున్నట్లు పేర్కొన్నాడు. పవన్ వైఫ్ అన్నాలెజినోవా పేరిట చరాస్తులు, రూ. కేవలం రూ. 30 లక్షలు మాత్రమేనని, అకీరా, ఆద్య పేరిట ఆస్తులు రూ. 2.55 కోట్లు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నా కంటే రేణు‌దేశాయ్‌కు ఆస్తులు ఎక్కువగా వున్నాయన్నమాట.

గోల్డ్ విషయంలో 312 గ్రాములు వున్నట్లు తెలిపాడు పవన్. మెర్సిడెస్ బెంజ్ R- క్లాస్ R350, వోల్వో XC90, హర్లే డేవిడ్ సన్ హెరిటేజ్ సాఫ్టైల్, మహీంద్రా స్కార్పియో, స్కొడా రాపిడ్, టయోటా ఫోర్ట్యునర్లను కలిగి ఉన్నాడు. హైదరాబాద్, ఏపీ రాష్ర్టాల్లో మూడు ప్రాంతాల్లో వ్యవసాయ భూమి వున్నట్టు ప్రస్తావించాడు. తనకు సన్నిహితుడైన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర రూ. 2.40 కోట్లు, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ దగ్గర రూ. 1.25 కోట్లు, తన వదిన సురేఖ దగ్గర రూ.1.07 లక్షలు అప్పు తీసుకున్నానని అఫిడవిట్‌లో పేర్కొన్నాడు పవన్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *