బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను ఆదివారం మధ్యాహ్నం పెను తుపానుగా మారింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు సుమారు 500 కి.మీ.దూరంలో, కాకినాడకు 600 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన ఈ తుపాను సోమవారం సాయంత్రం విశాఖ-తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర తీరమంతా మేఘావృతం కాగా.. నెల్లూరు నుంచి కృష్ణా జిల్లాల వరకు చిరు జల్లులు పడుతున్నాయి. పశ్చిమ గోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లాల వరకు చాలా చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియవచ్చునని అంచనా వేస్తున్నారు. సైక్లోన్ ప్రభావంతో గంటకు 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *